మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayana Stotram by Adi Shankaracharya – శ్రీ నారాయణ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే ||
నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ || 1
నవనీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || 2
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || 3
పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || 4
మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || 5
రాధాఽధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || 6
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || 7
[* బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ *]
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || 8
జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || 9
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || 10
అఘబకక్షయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || 11
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || 12
దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || 13
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || 14
సరయూతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ || 15
విశ్వామిత్రమఖత్ర వివిధపరాసుచరిత్ర నారాయణ || 16
ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || 17
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || 18
దశరథవాగ్ధృతిభార దండకవనసంచార నారాయణ || 19
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || 20
వాలినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || 21
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || 22
జలనిధిబంధనధీర రావణకంఠవిదార నారాయణ || 23
తాటకమర్దన రామ నటగుణవివిధధనాఢ్య నారాయణ || 24
గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || 25
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || 26
అచలోద్ధృతిచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || 27
నైగమగానవినోద రక్షితసుప్రహ్లాద నారాయణ || 28
[* భారతియతివరశంకర నామామృతమఖిలాంతర నారాయణ *]
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచిత నారాయణస్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.